గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) ఆధ్వర్యంలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల పరిధిలో 35 గ్రామాలను ఎంపిక చేసి వచ్చే నెలలోనే స్టేషన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
గత రెండేళ్లలో రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో 12,041 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఈవీ వినియోగదారులు సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. సహకార శాఖ, రెడ్కో అధికారులు కలిసి ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు.
ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుండగా.. అందులో పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద రూ.13 లక్షల సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సహకార సంఘాలు భరిస్తాయి. ఒక కిలోవాట్ అవర్ ఛార్జింగ్‌కు రూ.18 వసూలు చేయాలని ప్రతిపాదించారు.
డిమాండ్ పెరిగే కొద్దీ అదనపు ఛార్జింగ్ గన్‌లు ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















