ఆర్మీలో చేరాలనుకున్నా
నేను జంషెడ్‌పూర్‌లో పుట్టా. నాన్న టాటా స్టీల్‌లో ఉద్యోగి, అమ్మ బ్యాంక్ మేనేజర్. కొల్హాపూర్‌లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు ఎన్‌సీసీ కేడెట్‌గా చాలా చురుగ్గా ఉండేవాడిని. అది చూసే స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా కెనడాలో ఏడాదిపాటు ఉండేందుకు నన్ను ఎంపిక చేశారు. యూకేలోనూ కొద్దిరోజులున్నా. ఆరు నెలలపాటు అక్కడి ఆర్మీలో శిక్షణ కూడా పొందా. ఆ శిక్షణే నాలో ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఆసక్తిని కలిగించింది.
ఆ ప్రశ్నతోనే మోడలింగ్‌లోకి…
మన దేశానికి తిరిగొచ్చాక, ఆర్మీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పడటంతో దరఖాస్తు చేశా. కానీ, నా వయసు ఆరు నెలలు ఎక్కువ ఉండటంతో నా ఆర్మీ కలలన్నీ కల్లలయ్యాయి. ఆ తర్వాత ‘పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్’లో ట్రైనింగ్ తీసుకున్నా. ఆ అనుభవంతోనే క్లాసులు చెప్పడం మొదలెట్టా. ఒకరోజు ఓ స్టూడెంట్, ‘సర్… మీరు కెమెరాలో చాలా బాగా కనిపిస్తున్నారు. సినిమాల్లో ప్రయత్నించకపోయారా?’ అంది. ఆ ప్రశ్నే నన్ను మోడలింగ్ వైపు అడుగులు వేయించింది.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ…
మోడలింగ్ చేస్తుండగానే ఓ హిందీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. రియాలిటీ షోలూ చేశా. ఓ దర్శకుడికి నా స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చి, సినిమా అవకాశం ఇచ్చాడు. కానీ, అది ఫ్లాప్. ఆ తర్వాతదీ ఫ్లాపే. వరసగా రెండు పరాజయాలతో దిగాలుగా ఉండగా.. అనుకోకుండా మణిరత్నం గారి నుంచి పిలుపొచ్చింది. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఎలయ్‌పాయుతే’తో మొదటి హిట్ అందుకున్నా. అదే తెలుగు ‘సఖి’. ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చా. ఇక అక్కడి నుంచి రొమాంటిక్ హీరోగా నాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు.
సరిత… ఎయిర్‌హోస్టెస్
నా శ్రీమతి సరిత ఎయిర్‌హోస్టెస్. పబ్లిక్ స్పీకింగ్ క్లాసులో నా స్టూడెంట్ కూడా. అక్కడే ఇద్దరం ఒకరికొకరం నచ్చడం, ప్రేమా, ఇంట్లో వాళ్లూ ఒప్పుకోవడంతో పెళ్లీ ఓ కలలా జరిగిపోయాయి. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉంటే.. ఒకరోజు మా ఆవిడ ‘నువ్వు ఖాళీగా ఉండటాన్ని నేనెప్పుడూ చూడలేదు. పని ఉన్నప్పుడే నీలో ఉత్సాహం కనిపించేది. అది ఇప్పుడు లేదు. ఎప్పటిలాగే బయటికెళ్లి, ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించు’ అంది.
రెయిన్ మ్యాన్ అనేవార
పని నుంచి కొంత విరామం కావాలనుకొని 2011 నుంచి 2015 వరకూ అన్నీ వదిలేసి దేశమంతా చుట్టొచ్చా. కనిపించిన వారందరితోనూ మాట్లాడా. ఆ నాలుగేళ్ల పర్యటన నాకెన్నో జీవిత పాఠాలు నేర్పింది. ఆ తర్వాతి నుంచి విభిన్నమైన పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నా. ఇటీవలి ‘ధురంధర్’ సినిమా షూటింగ్ సెట్లో నన్నందరూ ‘రెయిన్ మ్యాన్’ అని పిలిచేవారు. నేనెప్పుడు సెట్‌కి వెళ్లినా వర్షం పడటమే అందుకు కారణం.
ఫిట్‌నెస్ సీక్రెట్
నాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం ‘రాకెట్రీ’. ఆ సినిమాలో ఇస్రో శాస్త్రవేత్త నంబి పాత్ర కోసం పొట్ట పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత అందరూ సిక్స్‌ప్యాక్ అంటుండటం, మూడు నెలల్లోనే సాధించొచ్చనీ చెప్పడంతో నేనూ ప్రయత్నించా. కానీ, నాకు మాత్రం ఏడాదిన్నర పట్టింది. అది ఎంత కష్టమైన పనో అప్పుడే అర్థమైంది. ఆకలి వేసినప్పుడే తినడం, త్వరగా నిద్రపోవడమే నా ఫిట్‌నెస్ సీక్రెట్.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















