ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ప్రాణాలు కోల్పోయాడు. వనదుర్రు గ్రామానికి చెందిన జయరాం.. తన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికికై హజరై తిరిగి అమెరికా వెళ్లేందుకు.. శనివారం తెల్లవారు జామున రోడ్డు మార్గంలో హైదరాబాద్ పయనమయ్యాడు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో చినపాలపర్రు సమీపంలో కారు రోడ్డుకు అపసవ్యదిశలో ప్రయాణించి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అందులో చిక్కుకున్న జయరాం అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జయరాం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















