Telanganaలో సోమవారం తీవ్ర వడదెబ్బ కారణంగా నాలుగు జిల్లాల్లో నలుగురు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.Bodhan Mandalలోని ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఎరుకల నర్సయ్య (52) ఉపాధి హామీ పనుల్లో ఉండగా వడదెబ్బతో పడిపోయారు. వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Mulugu district కమలాపురానికి చెందిన షేక్ మైబూబ్ (58) ఇంటివద్ద పనిచేస్తుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.Karimnagar districtలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ మంచికట్ల తిరుపతి (53) రెండు రోజులుగా విద్యుత్ పనులు చేసిన అనంతరం సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురై మరణించారు.
Jogulamba Gadwal districtలోని ఉండవల్లి గ్రామానికి చెందిన జమిలాబీ (34) పొలంలో పనులు చేస్తుండగా ఎండవేడికి తట్టుకోలేక గుండె నొప్పితో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















