పేపర్‌లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బాలిక క్షమాపణలు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనకు 15 ఏళ్ల వయసు మాత్రమేనని పేర్కొన్న బాలిక.. ఇతరుల ప్రభావంతో తాను అలా మాట్లాడానని, తన మాటలకు చింతిస్తున్నానని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయబోనని చెబుతూ ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది.
ఈ వ్యవహారంపై నోయిడా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. అనంతరం జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు చేసిన వ్యాఖ్యలను క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాలిక తల్లి కూడా పోలీసులకు క్షమాపణ లేఖ ఇచ్చామని, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















