ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు బలపడటంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు 5 శాతం వరకు ఎగసాయి.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో వెండి కిలో మార్చి నెల కాంట్రాక్ట్ 4.74 శాతం పెరిగి రూ.2,61,745కి చేరింది. ఒక్క రోజులోనే దాదాపు రూ.11 వేల పెరుగుదల నమోదైంది. అదే విధంగా 10 గ్రాముల మేలిమి బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర 1.3 శాతం పెరిగి రూ.1,57,540కి చేరింది. అంటే సుమారు రూ.2 వేల వరకు ధర పెరిగింది.
బంగారం ధర
24 క్యారెట్ బంగారం: సుమారు ₹1,56,000 – ₹1,58,000 per 10 గ్రా (MCX & స్థానిక రేట్ల ఆధారంగా)
22 క్యారెట్ బంగారం: సుమారు ₹1,43,000 – ₹1,47,000 per 10 గ్రా వివిధ పట్టణాల్లో నమోదు అయ్యింది.
వెండి ధర
వెండి (Silver) సుమారు ₹2,99,000 – ₹3,20,000 per కిలోగా ట్రేడవుతోంది.
1 గ్రాం వెండి సుమారు ₹299 – ₹320 ఉంది.
అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ మళ్లీ కీలకమైన 5,000 డాలర్ల మార్కును దాటింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఔన్సు బంగారం ధర 5,004 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు ధర 81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ బలహీనత, గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతుండగా, వెండి కిలో ధర రూ.2.70 లక్షల పైనే ట్రేడవుతోంది.రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ ధోరణులు, అమెరికా ఆర్థిక డేటా, వడ్డీ రేట్లపై అంచనాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మరింత ఊగిసలాట కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















