హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో కేవలం రూ.700 వివాదం కారణంగా ఓ యువకుడు హత్యకు గురైన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీ టెక్నీషియన్ మహ్మద్ హుస్సేన్ (24)ను కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, హుస్సేన్ గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు కె. ప్రశాంత్ గంజాయి కోసం రూ.700 అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే డబ్బు, గంజాయి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
ఈ నెల 9న రాత్రి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 223 వద్ద హుస్సేన్‌ను అడ్డుకున్న నిందితుడు అతడిని ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ 10 మంది కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసులో రెండు బైకులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ బృందాన్ని సీపీ సజ్జనర్ అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















