ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
బుధవారం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రమోషన్లు, మూడంచెల వ్యవస్థ అమలు అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ప్రధాన నిర్ణయాలు :
- సచివాలయ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు
- సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక అధికారి, ప్రతి మండలానికి ఒక ఆఫీసర్‌ను డిప్యూటేషన్ పద్ధతిలో నియామకం
- సిబ్బంది పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరణ
- ప్రజల సంతృప్తి స్థాయి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్చిలోపు ఈ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
దివ్యాంగులు, వయోవృద్ధులకు సంబంధించిన కీలక అంశాలు:
- దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు, త్రీవీలర్ మోటార్ సైకిళ్ల ఉచిత పంపిణీ
- దివ్యాంగ పాఠశాలల్లో వందశాతం అడ్మిషన్లు పూర్తి చేయాలి
- అవసరమైన చోట్ల మరమ్మతులు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు
- వయోవృద్ధులకు వయో వందన – ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
- ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, నైపుణ్య శిక్షణ
అదేవిధంగా, పాఠశాల విద్యార్థులకు అందించే ఆహార మెనూ అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులను త్వరగా గుర్తించి ప్రభుత్వ పథకాలు ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఈ నిర్ణయాలతో గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, సంక్షేమ పథకాల అమలు మరింత బలోపేతం కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















