ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి తిరుమల ఆలయానికి చేరుకున్న ఆయన.. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17, ఇఓఎస్-05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఇస్రో చైర్మన్ నారాయణన్‌కు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ద్వారా ఇఓఎస్-05 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లనుంది.
ప్రయోగానికి ముందు శ్రీవారి సన్నిధిలో నమూనా రాకెట్‌ను ఉంచి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశ ప్రతిష్ఠను మరింత పెంచేలా ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఆకాంక్షిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















