పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు ముదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్–అమెరికా మధ్య హర్మూజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9.31 గంటల సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్లు కోల్పోయి 76,262 వద్ద, నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 23,823 వద్ద ట్రేడయ్యాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా నమోదైంది.
పశ్చిమాసియాలో ఘర్షణలు మళ్లీ తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 95.52 డాలర్లకు చేరుకోగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, కంపెనీల వ్యయాలపై ప్రభావం పడొచ్చన్న ఆందోళనలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















