అగ్ర కథానాయకుడు చిరంజీవి ఫుల్ జోష్‌తో తన కొత్త సినిమాను ప్రారంభించారు. దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. తాత్కాలికంగా ‘Mega 158’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు కొణిదెల హాజరయ్యారు. ప్రత్యేకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే కారులో కార్యక్రమానికి రావడం అభిమానుల్లో భారీ ఆకర్షణగా నిలిచింది. మెగా బ్రదర్స్ కలయికను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించగా, చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకకు హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా హాజరయ్యారు. ఆమె ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం బాబీ–చిరంజీవి కలయికలో వస్తున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















