రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి T. Harish Rao ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని ఎన్సాన్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం “మిషన్ మోడ్”లో కాకుండా “కమిషన్ మోడ్”లో వ్యవహరిస్తోందని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలు ఆపి, కొనుగోలు కేంద్రాల్లో లారీల ట్రిప్పులు పెంచాలని హరీశ్‌రావు సూచించారు. క్వింటాల్ ధాన్యానికి 5 కిలోల తరుగుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా మంత్రులు, అధికారులు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు.
రైతుబంధు పథకంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. 45 రోజుల్లో రైతుబంధు ఇస్తానని సిద్దిపేట గడ్డపై సీఎం ఇచ్చిన హామీ 63 రోజులు అయినా నెరవేరలేదని ఆయన గుర్తు చేశారు.ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















