జగిత్యాల జిల్లాలో వరికోత యంత్రం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం, పెగడపల్లి మండలం నందగిరికి చెందిన పాలకాల మధు (30) హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ధనాల పరశురాంకు చెందిన యంత్రంతో ఆదివారం వరి కోత పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది.
పని జరుగుతున్న సమయంలో యంత్రం అదుపుతప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి పడిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై కిరణ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో యంత్రాన్ని బయటకు తీశారు.తర్వాత గజ ఈతగాళ్ల సహాయంతో దాదాపు రెండు గంటల పాటు గాలించగా డ్రైవర్ మధు మృతదేహం లభ్యమైంది.
మృతుడు మధుకు భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని, అర్హతల ఆధారంగా మృతుడి భార్యకు ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















