ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మిత్రదేశమైన ఒమన్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌తో కలిసి హర్మూజ్ వద్ద నౌకల నుంచి టోల్ వసూలు చేసే ప్రయత్నాలు చేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ఈ మార్గం ద్వారా రోజూ లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతోంది. అలాంటి ప్రాంతంలో టోల్ విధించడం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా భావిస్తోంది.
స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఒమన్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇరాన్‌కు సహకరిస్తే అమెరికా ఆర్థిక మంత్రిత్వశాఖ కఠిన ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు. అయితే, అనంతరం ఒమన్ నుంచి టోల్ వసూలు చేసే ఎలాంటి ప్రణాళికలు లేవని స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలిపారు. ఒమన్ రాయబారితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఈ వివరాలు వెల్లడించారు.
ఇక అమెరికా-ఇరాన్ సంబంధాలపై కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌తో ఒక ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా అధికారులు వెల్లడించారు. హర్మూజ్‌లో స్వేచ్ఛా వాణిజ్యానికి భరోసా ఇవ్వడం, యురేనియం నిల్వలను అప్పగించడం, అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేయడం వంటి అంశాలపై ఇరాన్ అంగీకరిస్తే ఒప్పందం సాధ్యమవుతుందని తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ వద్ద సుమారు 2 వేల నౌకలు నిలిచిపోయినట్లు సమాచారం. అయినప్పటికీ మే నెలలో చమురు ధరలు 10 శాతం తగ్గినట్లు అమెరికా పేర్కొంది. పరిస్థితులు చల్లబడిన తర్వాత చమురు ధరలు సాధారణ స్థితికి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌తో చర్చల్లో పురోగతి ఉందని వెల్లడించారు. కొన్ని కీలక అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















