ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

September 17, 2026
in Telangana News, News
0
మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

తొలుత పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన పలు బృందాలు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్‌ విమోచనం కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. మహనీయుల పోరాటాలు, త్యాగాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడం దేశ సమైక్యత, సమగ్రత చరిత్రలో కీలక ఘట్టమని వివరించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ సమైక్యతకు చేసిన కృషిని కూడా ప్రస్తావించారు.

కార్యక్రమంలో హైదరాబాద్‌ విమోచన చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనతో పాటు తెలంగాణ కళారూపాలు, వేయిస్తంభాల గుడి, బతుకమ్మ తదితర అంశాలను ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించారు. ‘హైదరాబాద్‌ విమోచనం’ ఇతివృత్తంతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌-జోధ్‌పుర్‌కు మధ్య చారిత్రకంగా విడదీయరాని బంధం ఉందన్నారు. తాను జోధ్‌పుర్‌ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో అనేకమంది యోధులు పోరాడారని, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం వారు చేసిన పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాంను ప్రశంసించడంపై విమర్శలు చేశారు. నిజాం పాలనపై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, రావి నారాయణరెడ్డి వంటి వారు పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను బీజేపీ చాలా కాలంగా చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామగ్రామాన విమోచన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, ఎంపీ ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

ShareTweetSend
Previous Post

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

Next Post

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

Related Posts

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!
India News

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

September 17, 2026
యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్
India News

యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

September 17, 2026
వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!
India News

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌
Telangana News

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

September 17, 2026
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల
Telangana News

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

September 17, 2026
మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి
Andhra Pradesh News

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

September 17, 2026
Next Post
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 17, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

September 17, 2026
యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

September 17, 2026
వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

September 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

ఆస్తులు అమ్ముకున్నారు.. అనాథలకు నాన్నయ్యారు!

September 17, 2026
యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

యూపీఐ ట్యాక్స్‌పై అసలు చర్చే జరగలేదు: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్

September 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.