ఆన్‌లైన్ ఫార్మసీల (ఈ-ఫార్మసీ) అమ్మకాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists మరియు Telangana Chemists and Druggists Association పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది.
ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో 25 వేలకుపైగా మెడికల్ షాపులు మూతపడగా, ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 12 వేల దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో ప్రజలు అత్యవసర మందుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Damodar Rajanarasimha అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు ఫార్మసీలు అందుబాటులో ఉంచాలని సూచించారు.అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. అలాగే Apollo Pharmacy, MedPlus వంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్లు తెరిచి ఉంచాలని కోరారు. అత్యవసర మందుల కోసం 1800-599-6969 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















