గోవా అనగానే యువతకు ఎంతో క్రేజ్! బీచ్‌లలో ఎంజాయ్ చేయడానికి, డిస్టినేషన్ వెడ్డింగ్స్‌కు గోవా ఎప్పుడూ ఫేవరెట్ స్పాట్. ఇప్పుడు అతి తక్కువ ధరకే గోవాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునేలా TGSRTC ఒక స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.
టూర్ ప్యాకేజీ హైలైట్స్:
టికెట్ ధర: కేవలం రూ. 5,130 (ఒక్కొక్కరికి)
ప్రయాణం ప్రారంభం: ఫిబ్రవరి 25 (హైదరాబాద్ నుంచి)
కవర్ చేసే ప్రాంతాలు: కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్, గోవా.
ఈ ట్రిప్‌లో మీరు చూసే అద్భుత ప్రదేశాలు ఇవే:
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం: హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ముందుగా కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుంటుంది.
ఉడిపి (ఆధ్యాత్మికత & ప్రకృతి రమణీయత):
శ్రీ కృష్ణ మఠం: ఇక్కడి విశిష్టత ఏంటంటే.. స్వామివారిని నేరుగా కాకుండా ‘కనకన కిండి’ అనే 9 రంధ్రాల కిటికీ ద్వారా దర్శించుకుంటారు.
బీచ్‌లు: మల్పే బీచ్, మేరీస్ ఐలాండ్, కాపు బీచ్ లాంటి అందమైన తీరప్రాంతాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
మురుడేశ్వర్ (అద్భుతమైన శివయ్య దర్శనం):
అరేబియా సముద్ర తీరాన కొలువై ఉన్న పరమేశ్వరుడి ఆలయం ఇది.
ప్రత్యేకతలు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం (దాదాపు 123 అడుగుల ఎత్తు) ఇక్కడ ఉంది. అలాగే 20 అంతస్తులతో నిర్మించిన రాజగోపురం (237.5 అడుగుల ఎత్తు) భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
గోవా (2 రోజుల ఫన్ ట్రిప్): ఆధ్యాత్మిక పర్యటన అనంతరం బస్సు నేరుగా గోవా చేరుకుంటుంది. అక్కడ రెండు రోజుల పాటు పర్యాటకులు గోవా బీచ్‌లు, వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఆ తర్వాత బస్సు నేరుగా హైదరాబాద్ చేరుకుంటుంది.
బుకింగ్ & ఇతర వివరాల కోసం:
వెబ్‌సైట్: www.tgsrtcbus.in
సంప్రదించాల్సిన నంబర్లు: 9391072283, 9063401072
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















