ఇంజినీరింగ్ కోసం ఐఐటీలు, వైద్య విద్య కోసం ఎయిమ్స్, మేనేజ్‌మెంట్ కోసం ఐఐఎంలు ఉన్నట్లే.. వ్యవసాయ విద్యకు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందిస్తున్నాయి.
ఈ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష నిర్వహిస్తోంది. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు చదువుతున్న సమయంలో నెలవారీ స్టైపెండ్ కూడా అందుతుంది.దేశవ్యాప్తంగా 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష స్కోరు ప్రామాణికంగా ఉంటుంది. ఇందులో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్రీయ వ్యవసాయ సంస్థలు ఉన్నాయి.
యూజీ స్థాయిలో బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హతతో ప్రవేశం లభిస్తుంది.పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో కూడా వ్యవసాయం, అనుబంధ విభాగాల్లో విస్తృత కోర్సులు ఉన్నాయి. పీజీకి యూజీ ఉత్తీర్ణత అవసరం కాగా, పీహెచ్‌డీకి పీజీ అర్హత తప్పనిసరి.స్టైపెండ్ పరంగా యూజీ విద్యార్థులకు రూ.3000 వరకు, పీజీకి రూ.5000 నుంచి రూ.12,640 వరకు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.37,000 నుంచి రూ.42,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















