సాధారణ డిగ్రీతోనే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో అధికారి స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. తాజాగా ఆర్‌బీఐ గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే సుమారు రూ.1.55 లక్షల వరకు జీతం లభించనుంది.
ఈ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్-1లో ఆబ్జెక్టివ్ విధానంలో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. దీని తర్వాత ఫేజ్-2లో ఎకనామిక్స్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్‌పై డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు.చివరగా ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. మొత్తం ప్రాసెస్‌లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులకు పరిమిత ప్రయత్నాలు మాత్రమే ఉండగా, ఇతర కేటగిరీలకు వయో పరిమితి ఆధారంగా మినహాయింపులు ఉంటాయి.
అర్హతల ప్రకారం, జనరల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పీజీ అవసరం. ఎకనామిక్స్, ఫైనాన్స్ సంబంధిత స్పెషలైజేషన్ ఉన్న పోస్టులకు పీజీ తప్పనిసరి.దరఖాస్తులు మే 20 వరకు స్వీకరిస్తారు. ఫేజ్-1 పరీక్ష జూన్ 13, 2026న నిర్వహించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















