కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 23 పతకాలు చేరాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, 12 రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ పదో స్థానంలో కొనసాగుతోంది.
అయితే పోటీలు ముగింపు దశకు చేరుకోవడంతో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 25 పతకాలు సాధించే అవకాశాలు భారత క్రీడాకారులకు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సింగ్‌లో పది మంది భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకోవడంతో స్వర్ణ పతకాలపై భారీ ఆశలు నెలకొన్నాయి.
బాక్సింగ్‌తో పాటు అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, జూడో విభాగాల్లోనూ భారత క్రీడాకారులు కీలక పోటీల్లో బరిలోకి దిగనున్నారు. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిస్తే భారత్ పతకాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పతకాల పట్టికలో ప్రస్తుత పదో స్థానం నుంచి టాప్-5లోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది.
అథ్లెటిక్స్‌లో పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్‌లో ప్రవీణ్ చిత్రావెల్, సెల్వ ప్రభు తిరుమరన్ బరిలో ఉన్నారు. మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంకా గోస్వామి, రవీనా గైక్వాడ్ పతకం కోసం పోటీ పడనున్నారు. పురుషుల పోల్ వాల్ట్‌లో దేవ్ కుమార్ మీనా, కుల్‌దీప్ కుమార్, పురుషుల 5 వేల మీటర్ల వాక్‌లో గుల్వీర్ సింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేలోనూ భారత్‌కు పతక ఆశలు ఉన్నాయి.
పారా అథ్లెటిక్స్‌లో పురుషుల షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రానా, శుభ్‌మ్ జుయల్ పోటీ పడనుండగా.. పురుషుల 1500 మీటర్ల టీ54 విభాగంలో రమేశ్ షణ్ముగం బరిలోకి దిగనున్నారు.బాక్సింగ్‌లో భారత్‌కు అత్యధిక పతకాల ఆశలు ఉన్నాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి, 57 కేజీలలో జాస్మైన్, 51 కేజీలలో సాక్షి, 60 కేజీలలో ప్రియా, 70 కేజీలలో లొవ్లీనా ఫైనల్స్‌లో పోటీ పడనున్నారు. పురుషుల విభాగంలో 55 కేజీలలో జాదుమణి, 60 కేజీలలో సచిన్, 80 కేజీలలో అంకుష్ పంఘాల్, 90 కేజీలకు పైబడిన విభాగంలో నరేందర్ స్వర్ణం కోసం పోరాడనున్నారు.
జూడోలోనూ భారత క్రీడాకారులకు పతక అవకాశాలు ఉన్నాయి. ఉన్నతి శర్మ, కరంజిత్ సింగ్ మాన్, హర్ష్ టోకస్, ఇనుంగన్బి తఖెల్లాంబమ్ తమ తమ విభాగాల్లో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారు.
కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో భారత క్రీడాకారుల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చివరి రోజు పోటీల్లో మరిన్ని పతకాలు సాధించి భారత్ పతకాల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















