ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశమే ఇప్పుడు దాని ప్రభావాలను ఎదుర్కొంటోందని భారత్ ఎద్దేవా చేసింది.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా పాకిస్థాన్, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ స్పందించింది. ఈ మేరకు భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి అనుపమా సింగ్ పాకిస్థాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, అది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోనూ భారత్ అవిభాజ్య భాగమేనని ఆమె స్పష్టం చేశారు. పాకిస్థాన్ దురుద్దేశపూర్వక ఆరోపణలను భారత్ పూర్తిగా తిరస్కరిస్తోందని తెలిపారు.
సింధూ జలాల ఒప్పందంపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ అనుపమా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం అంతర్జాతీయ ఒప్పందాల ప్రయోజనాలు పొందకూడదని ఆమె పేర్కొన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని, కాలపరిమితిని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పాకిస్థాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు కనీస హక్కులు లేవని, అక్కడి పరిస్థితులపై ఇటీవల ప్రజా నిరసనలు వెలువడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ప్రజలు హక్కులు, గౌరవం కోరుతుంటే అక్కడి ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















