ప్రపంచకప్ బెర్తును ఇప్పటికే ఖాయం చేసుకున్న India women’s national field hockey team ఎఫ్‌ఐహెచ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌లో ఇటలీ జట్టును ఎదుర్కొననుంది. పూల్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. అదే జోరును కొనసాగిస్తూ ఫైనల్ చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పూల్-బిలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండు విజయాలు, ఒక డ్రాతో మొత్తం ఏడు పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పాయింట్ల పరంగా స్కాట్లాండ్ సమంగా నిలిచినా గోల్స్ అంతరంలో మెరుగ్గా ఉండటంతో భారత్ టాప్ ప్లేస్ సాధించింది. దీంతో ప్రపంచకప్ బెర్తును కూడా సొంతం చేసుకుంది.ఇదిలా ఉండగా పూల్-ఎలో ఒక్కో గెలుపు, ఓటమి, ఒక డ్రాతో నాలుగు పాయింట్లు సాధించిన ఇటలీ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. టోర్నీ గణాంకాల ప్రకారం చూస్తే ఈ సెమీస్‌లో ఆతిథ్య జట్టైన భారత్‌కే కొంత ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తోంది.
భారత్‌కు స్టార్ ఫార్వర్డ్ Navneet Kaur అద్భుత ఫామ్‌లో ఉండటం పెద్ద బలంగా మారింది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగు గోల్స్ సాధించి టాప్ స్కోరర్లలో ఆమె ముందంజలో ఉంది. ముఖ్యంగా వేల్స్‌తో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో నవనీత్ హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇరు జట్ల మధ్య గత రికార్డులు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2012 తర్వాత భారత్, ఇటలీ జట్లు మొత్తం ఏడు సార్లు తలపడగా.. అందులో ఐదు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఇటలీ కేవలం ఒకసారి మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్‌లోనూ భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుతుందనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















