అమరావతి – అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందమే కాకుండా, నిరంతర గ్లోబల్ వృద్ధికి దోహదపడే దూరదృష్టి నిర్ణయమని అభివర్ణించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా తన స్థానం మరింత పటిష్ఠం చేసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారత ఎగుమతుల పోటీ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు.
ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రైతులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఆహార ఎగుమతులకు ఈ ఒప్పందం పెద్ద ఊతమిస్తుందని తెలిపారు.
మొత్తంగా ఈ వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక ప్రగతిలో మరో కీలక ముందడుగుగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















