ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రెండో దశ అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం నగరానికి చాలా దూరంగా రెండు పడకగదుల ఇళ్లను నిర్మించడం వల్ల లబ్ధిదారులు జీవనోపాధి సమస్యలతో అక్కడ నివసించలేకపోయారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, మురికివాడలు, పాత హౌసింగ్ కాలనీలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.హైదరాబాద్ పరిధిలో స్థలం ఉన్న అర్హులందరికీ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కూడా మంత్రి తీవ్ర హెచ్చరికలు చేశారు. మల్కాజిగిరిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూముల రిజిస్ట్రేషన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, పేదరికమే ఇందిరమ్మ ఇళ్ల అర్హతగా పరిగణిస్తామని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















