రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. కందాడ గ్రామానికి చెందిన షేర్ కృష్ణారెడ్డి రెండో కుమారుడు సాత్విక్‌రెడ్డి మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు వెళ్లేందుకు షాబాద్ చౌరస్తాలో బస్సు కోసం వేచి ఉన్నాడు.
అదే సమయంలో ఆర్టీసీ బస్సు ముందుగా ఉన్న కారును తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న విద్యార్థిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















