ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా కొనసాగిస్తున్న దాడులకు విరామం ప్రకటించి, రెండు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరాన్‌తో సంప్రదింపులు ప్రారంభమవుతాయని ఆయన ప్రకటించారు.
ఇరాన్‌పై మరింత భారీ స్థాయిలో సైనిక చర్య చేపట్టాలని భావించినప్పటికీ.. చివరకు దౌత్య మార్గాన్నే ఎంచుకున్నామని ట్రంప్ తెలిపారు. ఘర్షణల కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనడం వల్ల అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల జరిగిన విధ్వంసాన్ని పునర్నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు.
ఈ చర్చల్లో హర్మూజ్ జలసంధి పరిస్థితులు, ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. సౌదీ అరేబియా విదేశాంగమంత్రి, పాకిస్థాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు అమెరికా-ఇరాన్ చర్చల ప్రకటన వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు కొంతమేర తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















