కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బెదిరించి వృద్ధ దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలను కాళ్లు, చేతులు కట్టేసి బంధించారు. అనంతరం ఇంట్లోని రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రెండు ఖరీదైన సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు.
మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంటి బయట లైట్లు ఆర్పేందుకు వచ్చిన 80 ఏళ్ల అజ్మత్ అలీని కారిడార్‌లో కాపుకాసి ఉన్న ఎనిమిది మంది దుండగులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను హాలులోకి లాక్కొచ్చి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బంధించారు. దోపిడీ అనంతరం కుటుంబ సభ్యులను గదిలోనే ఉంచి.. ఇంటి పార్కింగ్‌లో ఉన్న రెండు ద్విచక్రవాహనాలతో పరారయ్యారు.
పొరుగింటి వారి సహాయంతో బాధితులు బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలంలో దుండగులు వదిలి వెళ్లిన డమ్మీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు కరీంనగర్ నుంచి వరంగల్ మార్గంలో వెళ్లి హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలను వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తి వివాదాల నేపథ్యంలో బంధువులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















