కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన నకిలీ ఓట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత ఓటరు జాబితాలను మీడియా ముందు ప్రదర్శించారు.
కొడంగల్ ప్రాంతంలో లక్ష వరకు ఓట్లలో మార్పులు (మాడిఫికేషన్) జరిగాయని, ఇది అనుమానాలకు తావిస్తోందని కవిత పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
దేశంలో వన్ నేషన్–వన్ ఎలక్షన్–వన్ ఓట్ విధానం అమలు కావాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో సమానత్వం, పారదర్శకత అవసరమని ఆమె స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















