మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో సోమవారం మూసీ భూసేకరణ, పునరావాస అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అమలులో మానవీయ కోణానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు మూసీ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎవరి జీవితాలూ దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ దృష్టితోనే తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.
మూసీ నది కాలుష్యంతో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరీవాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు ఆయన తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వినోద కేంద్రాల అభివృద్ధి ద్వారా పరీవాహక ప్రాంతాలను కొత్త జీవన కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















