లేని ఆస్తులను ఉన్నట్లుగా సృష్టించి, వాటిని రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు కొట్టేసిన ముఠా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంపాపేట సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్ ఉర్ రెహ్మాన్‌ను కీసర పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కీసర సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఆయన అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ వల్లభనేని శ్రీనివాసరావు తదితరులు సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠాగా ఏర్పడి బ్యాంకులను మోసం చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తులు లేని వ్యక్తుల పేర్లతో నకిలీ పత్రాలు తయారు చేసి, నాగారం పరిధిలోని సర్వే నంబర్లు 400, 401లో ఆస్తులు ఉన్నట్లు చూపించారు. వాటిని ఆధారంగా చేసుకుని రుణాలు పొందేందుకు ప్రయత్నించారు.
ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ పాత్ర కీలకంగా మారింది. ఆస్తులు భౌతికంగా ఉనికిలో లేకపోయినా వాటికి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా నిందితులకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మొత్తం 11 ఉనికిలోలేని ఆస్తులను కాగితాలపై సృష్టించి, వివిధ బ్యాంకుల నుంచి రూ.4.11 కోట్ల మేర రుణాలు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
తొలుత కొన్ని నెలల పాటు రుణాల వాయిదాలు చెల్లించిన నిందితులు అనంతరం వాటిని ఎగ్గొట్టారు. నకిలీ పత్రాల ఆధారంగా రుణాలు పొందిన విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాలో బ్యాంకు సిబ్బంది, రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది సహా మొత్తం 29 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే వల్లభనేని శ్రీనివాసరావుతో పాటు పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో లేని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనే కోణంలో దర్యాప్తు చేయగా యూసుఫ్ ఉర్ రెహ్మాన్ పాత్ర బయటపడింది.
2015 నుంచి 2023 వరకు కీసర సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఆయన వందల సంఖ్యలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ఏడు కేసుల్లో ఆయనను నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















