కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ), విశాఖపట్నంలో ఉద్యోగావకాశాలు ప్రకటించింది. గ్రూప్-సీ, టెక్నికల్/నాన్-టెక్నికల్, నాన్-గెజిటెడ్ విభాగాల్లో మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్-ఏ.. 3 పోస్టులు :
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్-ఏ (లెవెల్-2) పోస్టులు మూడు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం.
కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్.. 2 పోస్టులు :
కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్ (లెవెల్-1) పోస్టులు రెండు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.
డ్రైవర్ పోస్టులు.. 4 :
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (లెవెల్-3) పోస్టులు మూడు ఉన్నాయి. పదో తరగతితో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, శారీరక సామర్థ్యం, మూడేళ్ల అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం అవసరం.
సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (లెవెల్-2) పోస్టు ఒకటి ఉంది. పదో తరగతి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజంపై అవగాహన, మూడేళ్ల అనుభవం ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
సీబీటీతో ఎంపిక :
విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను ప్రాథమికంగా పరిశీలించి రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు అదనంగా ఎండ్యూరెన్స్, స్కిల్ టెస్టులు ఉంటాయి.
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్, కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్ పోస్టులకు నిర్వహించే సీబీటీలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నల చొప్పున, సంబంధిత సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
డ్రైవర్ పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కాగా.. నెగెటివ్ మార్కింగ్ లేదు.
డ్రైవర్ పోస్టులకు శారీరక పరీక్షలు :
సీబీటీలో అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు కనీసం 35 శాతం, ఓబీసీ అభ్యర్థులు 30 శాతం, ఇతర వర్గాల అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాలి. అర్హత సాధించినవారిని 1:15 నిష్పత్తిలో ఎండ్యూరెన్స్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
ఎండ్యూరెన్స్ టెస్టులో ఇసుక, నీటితో నింపిన బకెట్లను 45 సెకన్లలో 100 మీటర్ల దూరం మోసుకెళ్లాలి. 20 స్క్వాట్స్, 15 పుషప్స్, 15 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని తదుపరి స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్టులో డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు ప్రభుత్వ రవాణా నిబంధనలు, ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన, మోటార్ మరమ్మతులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ), విశాఖపట్నంలో ఉద్యోగావకాశాలు ప్రకటించింది. గ్రూప్-సీ, టెక్నికల్/నాన్-టెక్నికల్, నాన్-గెజిటెడ్ విభాగాల్లో మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థులు పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్-ఏ.. 3 పోస్టులు :
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్-ఏ (లెవెల్-2) పోస్టులు మూడు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం.
కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్.. 2 పోస్టులు :
కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్ (లెవెల్-1) పోస్టులు రెండు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.
డ్రైవర్ పోస్టులు.. 4 :
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (లెవెల్-3) పోస్టులు మూడు ఉన్నాయి. పదో తరగతితో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, శారీరక సామర్థ్యం, మూడేళ్ల అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం అవసరం.
సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (లెవెల్-2) పోస్టు ఒకటి ఉంది. పదో తరగతి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజంపై అవగాహన, మూడేళ్ల అనుభవం ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
సీబీటీతో ఎంపిక :
విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఆధారంగా అభ్యర్థులను ప్రాథమికంగా పరిశీలించి రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు అదనంగా ఎండ్యూరెన్స్, స్కిల్ టెస్టులు ఉంటాయి.
కన్‌స్ట్రక్షన్ అసిస్టెంట్, కన్‌స్ట్రక్షన్ హ్యాండ్లర్ పోస్టులకు నిర్వహించే సీబీటీలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నల చొప్పున, సంబంధిత సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
డ్రైవర్ పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కాగా.. నెగెటివ్ మార్కింగ్ లేదు.
డ్రైవర్ పోస్టులకు శారీరక పరీక్షలు :
సీబీటీలో అన్‌రిజర్వుడ్ అభ్యర్థులు కనీసం 35 శాతం, ఓబీసీ అభ్యర్థులు 30 శాతం, ఇతర వర్గాల అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాలి. అర్హత సాధించినవారిని 1:15 నిష్పత్తిలో ఎండ్యూరెన్స్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
ఎండ్యూరెన్స్ టెస్టులో ఇసుక, నీటితో నింపిన బకెట్లను 45 సెకన్లలో 100 మీటర్ల దూరం మోసుకెళ్లాలి. 20 స్క్వాట్స్, 15 పుషప్స్, 15 సిటప్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని తదుపరి స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్టులో డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు ప్రభుత్వ రవాణా నిబంధనలు, ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన, మోటార్ మరమ్మతులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
వయసు, ఫీజు :
అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.350. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-09-2026.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews