సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులపై భారీ ఇనుప స్తంభాలు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు.
మృతుల్లో ఎక్కువమంది ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటూ రాఖీ పండుగ, కుటుంబ వేడుకల కోసం స్వస్థలాలకు బయలుదేరినవారే. ఒకరు తమ్ముడికి రాఖీ కట్టేందుకు వస్తుండగా.. మరొకరు కొత్తగా ఉద్యోగం రావడంతో ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇంకొకరు కుటుంబంలో పెళ్లి వేడుక కోసం బయలుదేరారు. ఇలా ఒక్కొక్కరి ప్రయాణం వెనుక ఓ ఆశ, ఓ కుటుంబ అనుబంధం ఉండగా.. మార్గమధ్యలోనే వారి జీవితాలు విషాదాంతమయ్యాయి.
లారీ బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ డివైడర్‌పైకి ఎక్కించి దాన్ని నిలిపివేశాడు. అయితే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడం, అక్కడ సరైన హెచ్చరికలు లేకపోవడం మరో ప్రమాదానికి కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. లారీని బస్సు ఢీకొనడంతో ఇనుప స్తంభాలను బిగించి ఉంచిన చైన్ తెగిపోయి అవి బస్సు అద్దాలను చీల్చుకుంటూ ప్రయాణికులపైకి దూసుకెళ్లాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















