నవ్వులతో పాటు ఒక మంచి సందేశాన్ని అందించే చిత్రంగా ‘లేచింది మహిళాలోకం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు లక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్–కార్తిక్ దర్శకత్వం వహించారు. హైమా రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంచు లక్ష్మి, “ఎంత సీరియస్ విషయమైనా హాస్యంతో చెప్పినప్పుడు ప్రేక్షకులు ఆసక్తిగా వినిపిస్తారు. మా సినిమా కూడా అలాంటి కథనే చెబుతుంది. ట్రైలర్ చూసి ఇది హత్య గురించి సినిమా అనుకోవద్దు. నవ్వులు పంచుతూ మంచి సందేశాన్ని అందించే చిత్రం” అని చెప్పారు.
శ్రీరామచంద్ర మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను, అనన్య నాగళ్ల జంటగా నటించాం. మా జోడీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం. అమ్మాయిలను గౌరవంగా చూసుకుంటే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పే కథ ఇది” అన్నారు.
అనన్య నాగళ్ల మాట్లాడుతూ, “ఇది నేను నటించిన తొలి పూర్తి స్థాయి కామెడీ సినిమా. ఇలాంటి వినోదభరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.
దర్శకులు అర్జున్–కార్తిక్ మాట్లాడుతూ, “అందరి సహకారంతో ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని తీశాం. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది” అన్నారు. నిర్మాతలు కూడా తమ తొలి ప్రయత్నంలో మంచి సినిమా తీశామనే సంతృప్తి ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కథలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నటులు హరితేజ, హేమ, అలాగే చిత్రాన్ని విడుదల చేస్తున్న యు.ఎఫ్.ఓ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్తో పాటు చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















