ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో భారత మార్కెట్లో కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. “Lenovo Idea Tab Pro Gen 2” పేరుతో వచ్చిన ఈ ట్యాబ్ ప్రీమియం ఫీచర్లతో ఆకర్షిస్తోంది.
ఇందులో 13 అంగుళాల 3.5K డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇది Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 10,200mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఈ ట్యాబ్ Android 16తో వస్తోంది. AI నోట్స్, స్మార్ట్ రీడర్, లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్, AI క్రియేషన్ టూల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Google Gemini, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరా విషయానికి వస్తే 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Dolby Atmos సపోర్ట్‌తో JBL క్వాడ్ స్పీకర్లు అందించారు. WiFi 7, Bluetooth 6 కూడా సపోర్ట్ చేస్తుంది.లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్ బాక్స్‌లోనే వస్తుంది. కీబోర్డ్, టచ్‌ప్యాడ్ మాత్రం విడిగా కొనాలి. ఈ ట్యాబ్ ధర రూ.39,999గా నిర్ణయించారు. మే 1 నుంచి అమెజాన్, లెనోవో వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















