అల్లాదుర్గం మండలంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. అకోలా–హైదరాబాద్ 161 జాతీయ రహదారి పక్కన ఉన్న అల్లాదుర్గం మండలం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డుపై చిరుత తిరుగుతూ కనిపించడంతో పలువురు భయాందోళనకు గురయ్యారు. చిరుతను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ మల్లయ్య, ఎస్‌ఐ శంకర్, ఏఎస్‌ఐ గాలయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు.
చిరుత సంచారం నేపథ్యంలో గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలను ఒంటరిగా వదలవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచనలు జారీ చేశారు.చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గ్రామస్తులు ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















