తెలంగాణలోని మందుబాబులకు తాత్కాలికంగా బ్యాడ్ న్యూస్ ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ఎన్నికలు జరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లను రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతిభద్రతల మధ్య నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అధికారుల వివరాల ప్రకారం, ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు అయిన ఫిబ్రవరి 11 సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. అదేవిధంగా ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 13న కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ, ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రమే అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ లోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. మద్యం విక్రయాలపై నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 2,996 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఫిబ్రవరి 9న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















