కాలేజ్ రోజుల్లో తనకు వచ్చిన లవ్ ప్రపోజల్‌ను మమితా ఇప్పటికీ గుర్తు చేసుకుంటోంది. తనను కలిసేందుకు కాలేజ్ గేట్ వద్ద ఎదురుచూసే ఆ వ్యక్తిలో కనిపించిన సిన్సియారిటీ తనకు నచ్చిందని ఆమె చెప్పింది.
సినిమాల్లోకి రావాలనే ఆలోచన మమితాకు చిన్నప్పటి నుంచీ లేదట. తొమ్మిదో తరగతిలో ఉండగా కుటుంబ స్నేహితుడి సూచనతో ఆడిషన్‌కు వెళ్లి ఎంపికైంది. అలా అనుకోకుండా వెండితెరపైకి అడుగుపెట్టింది.
చాలా సినిమాల్లో నటించినప్పటికీ ‘ప్రేమలు’ మమితా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలోని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, సహజమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులకు మరింత చేరువైంది.
చిన్నతనంలోనే సూర్యపై క్రష్ ఏర్పడిందని చెప్పిన మమితా.. ప్రస్తుతం తన సెలెబ్రిటీ క్రష్‌లుగా హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ పేర్లను చెబుతోంది. తెలుగులో మాత్రం అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని తెలిపింది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోని పెళ్లి పాట షూటింగ్ సమయంలో 102 డిగ్రీల జ్వరంతో బాధపడినా మమితా షూటింగ్ ఆపలేదట. షాట్‌ల మధ్యలో నెబ్యులైజర్ తీసుకుంటూ తిరిగి వచ్చి డ్యాన్స్ చేసిందని తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















