తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. కట్టనార్పట్టిలో ఉన్న ‘వనజ’ బాణసంచా పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 23 మంది కార్మికులు మృతి చెందారు.పరిశ్రమలోని 10 గదుల్లో 30 మందికి పైగా కార్మికులు పని చేస్తున్న సమయంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ముడి పదార్థాలు కలుపుతున్న సమయంలో రాపిడి కారణంగా పేలుడు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పేలుడు తీవ్రతకు మూడు గదులు పూర్తిగా కూలిపోయాయి. శబ్దం 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. శిథిలాల నుంచి 23 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం.
పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడి విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శిథిలాల కింద ఉన్న టపాసులు మళ్లీ పేలడంతో 12 మంది అగ్నిమాపక, పోలీసు సిబ్బంది గాయపడ్డారు.ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















