వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన రవాణా ఖర్చులు పెరగడంతో ఈ ధరల పెంపు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. మార్చిలో రూ.144, ఏప్రిల్‌లో రూ.195, ఇప్పుడు ఒక్కసారిగా రూ.993 పెరగడం వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,315కి చేరగా, దిల్లీలో రూ.3,071గా నమోదైంది. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ భారం చివరికి వినియోగదారులపై పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఐదు కిలోల సిలిండర్ ధర కూడా పెరిగి రూ.914.50కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















