హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో భారీ నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో పరిసర కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. సింగూరు నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఆకస్మికంగా దెబ్బతింది.
దీంతో ఎంప్లాయిస్ కాలనీ, శివసాయి కాలనీల్లోని అనేక అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లలోకి వరద నీరు ప్రవహించింది. పార్కింగ్‌లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు మరియు మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
పైప్‌లైన్ పగిలిన ప్రభావంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామునే ఈ ఘటన జరగడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ సమీపంలో ఉన్న పందెన్ వాగులోకి ఎక్కువ భాగం నీరు చేరడంతో మరిన్ని కాలనీలు ముంపుకు గురయ్యే ప్రమాదం తప్పింది.అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ మరమ్మతు పనులు వేగవంతం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















