వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి సుమారు 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.ఇక మరోవైపు India Meteorological Department ఆంధ్రప్రదేశ్‌కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని, ఈ నెల 26 నాటికి కేరళను తాకే అవకాశముందని అంచనా వేసింది. అదే సమయంలో వాయవ్య అరేబియా సముద్రం, కోమరిన్ ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల విస్తరణ కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















