భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మరియు బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 125 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను దాటాయి.
బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గురువారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని, 81 మండలాల్లో తీవ్ర వడగాలులు, 203 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపవచ్చని తెలిపారు.
ఇక మరోవైపు ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎండల ప్రభావంతో వడదెబ్బ కేసులు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 29 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధులు, కూలీలు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















