శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మంగళవారం హాజరవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు నేపథ్యంలో వారం క్రితం ఆయనను కొత్తూరులో పోలీసులు విచారించారు. అదే కేసులో రెండోసారి విచారణకు రావాలని కొత్తూరు సీఐ చింతాడ ప్రసాదరావు నోటీసులు జారీ చేశారు.
ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ మంగళవారం ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన తరఫు న్యాయవాది పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, అనారోగ్య కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నారని, సమయం కావాలని కోరినట్లు సమాచారం.
ఈ ఘటనకు ముందు దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద ఉదయం నుంచే హైడ్రామా నెలకొంది. పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరేముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఇటీవల వైద్య పరీక్షల్లో హృదయ సంబంధిత సమస్య ఉన్నట్లు తేలిందని, వైద్యులు మూడు వారాల విశ్రాంతి సూచించారని తెలిపారు. అయినప్పటికీ చట్టానికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతో పోలీసుల ఎదుట హాజరవుతున్నానని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆయనతో పాటు వెళ్లకుండా దివ్వెల మాధురిని పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు తెలిసింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీ తెలియకుండా పోయిన ఘటన కలకలం రేపింది.
విచారణ ప్రకారం, ఉదయం 11:50కి పోలీస్‌స్టేషన్‌కు వెళుతున్నట్లు చెప్పి బయలుదేరిన ఆయన తెంబూరు రోడ్డులో కొత్తపల్లి కూడలికి చేరుకున్న సమయంలో గన్‌మెన్, పీఏను వాహనం నుంచి దించేసి ముందుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనతో పాటు ఉన్న డ్రైవర్ మరియు ఇతరులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ పరిణామంతో కేసు విచారణ మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















