నీట్ 2026 ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జెన్-జీ శైలిలో యువతతో నేరుగా మమేకమవుతూ మోదీ చేసిన ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే ఈ వీడియో 30.3 కోట్లకు పైగా వ్యూస్ సాధించినట్లు పేర్కొంటూ రికార్డు స్థాయిలో వైరల్‌గా మారింది.
మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఒక్క రోజులోనే దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరినట్లు సమాచారం. యువతను ఆకట్టుకునేలా మోదీ ఉపయోగించిన భాష, ప్రదర్శించిన శైలి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పలువురు నెటిజన్లు ఈ వీడియోకు సంబంధించిన రీల్స్ రూపొందిస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మోదీ చేసిన సందేశానికి విద్యార్థుల నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మరోసారి ధన్యవాదాలు తెలిపారు. యువతతో మరింతగా మమేకం కావడానికి సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని మంత్రులకు కూడా సూచించినట్లు సమాచారం. దీంతో మోదీ సోషల్ మీడియా వ్యూహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















