ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Motorola Edge 70 Pro+ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది. 6500mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా సెటప్, ఆధునిక ప్రాసెసర్‌తో ఈ డివైస్‌ను రూపొందించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K సూపర్ HD+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటు, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు.
పవర్ బ్యాకప్ కోసం 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించగా, 90W వైర్డ్ టర్బో ఛార్జింగ్‌తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీర్ఘకాలిక వినియోగానికి ఇది మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
కెమెరా విభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో సోనీ LYT-710 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50MP హై-రెజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UIతో పనిచేస్తుంది. 3 OS అప్‌డేట్స్‌తో పాటు 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ హామీ ఇస్తోంది. డిజైన్ పరంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68, IP69 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో హై-రిజల్యూషన్ ఆడియోతో కూడిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
ధర విషయానికి వస్తే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.47,999కి కంపెనీ విడుదల చేసింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ ఫోన్ జూన్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















