నల్గొండ జిల్లా డిండి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మూడు వాహనాల్లో గొర్రెలను తరలిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున జడ్చర్ల–కోదాడ ప్రధాన రహదారిపై బ్రాహ్మణపల్లి గేటు వద్ద చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన చిట్టిగొండ ఎల్లయ్య తన కుటుంబ సభ్యులతో పాటు మరికొందరితో కలిసి గుంటూరు ప్రాంతానికి గొర్రెలను మేపేందుకు వెళ్లారు. సంక్రాంతి పండుగకు ముందు తిరిగి స్వగ్రామానికి వస్తూ మూడు వాహనాల్లో సుమారు 500 గొర్రెలను తరలిస్తున్నారు.
ముందుగా వెళ్తున్న వాహనం రెండు టైర్లు పంక్చర్ కావడంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. ఆ తర్వాత వెనుక వస్తున్న రెండో వాహనం లైట్లు వేసి ఆగింది. ఈ సమయంలో రహదారి మూలమలుపులో నిలిచిన వాహనాలను అతివేగంగా వచ్చిన మూడో వాహనం గమనించక ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. చిట్టిగొండ ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య పద్మ, కుమారుడు మల్లేష్‌తో పాటు డ్రైవర్ రామాంజనేయులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతతో వాహనాల్లో ఉన్న సుమారు 200 గొర్రెలు కూడా మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌ఛార్జి ఎస్సై నాగేంద్రబాబు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















