నేపాల్‌లో వరదలు, భారీ వర్షాలతో ఏర్పడిన విపత్కర పరిస్థితులు మరింత విషాదాన్ని నింపుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1,204 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో 4,216 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. భద్రతా సిబ్బంది ఇప్పటివరకు 11,993 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆచూకీ తెలియని వారిలో తమవారు కూడా ఉండొచ్చని భావించిన కొందరు కుటుంబాలు తీవ్ర విషాదంలో ప్రత్యామ్నాయంగా అంత్యక్రియలు నిర్వహించారు. భౌతికకాయాలు లభించకపోవడంతో పిండి బొమ్మలను తయారు చేసి వాటినే పార్థివదేహాలుగా భావించి కాఠ్‌మాండూలోని పశుపతినాథ్ ఆలయ సమీపంలో అంతిమ సంస్కారాలు చేపట్టారు.
భోటే కోశీ నది వరదలతో సహా నేపాల్‌లో సంభవించిన విపత్తుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ప్రధాని బాలేంద్ర షా పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు ప్రపంచ దేశాలే కారణమవుతున్నందున.. వాటి ప్రభావాన్ని తగ్గించడం, నియంత్రించడంలోనూ అంతర్జాతీయ సమాజానికి బాధ్యత ఉందని ఆయన అన్నారు.
భారత్, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఖతార్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జపాన్, సింగపూర్ తదితర దేశాలు నేపాల్‌కు సహాయం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
నేపాల్ వరదల్లో టెక్సాస్‌కు చెందిన నలుగురు భారత సంతతి వ్యక్తులు గల్లంతైనట్లు సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏ వెల్లడించింది. వారి ఆచూకీ కోసం లక్ష డాలర్ల నిధిని కేటాయించినట్లు సంస్థ తెలిపింది.
మరోవైపు భారత్ నేపాల్‌కు సహాయాన్ని కొనసాగిస్తోంది. బుధవారం మరో 5 టన్నుల ఔషధాలను పంపడంతో పాటు ప్రత్యేక పరికరాలు, 11 మంది నిపుణులతో కూడిన ఐదో విమానాన్ని అక్కడికి పంపింది. ఇప్పటివరకు 166 మంది భారతీయులను సహాయక బృందాలు రక్షించాయి. టిబెట్‌కు వెళ్లిన 410 మంది భారతీయ యాత్రికులు కూడా స్వదేశానికి బయలుదేరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















