డేర్ టు గో గ్లామ్’ అనే భావనతో రూపొందించిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను పండుగ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.6.09 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది. బెంగళూరు ఎక్స్‌షోరూమ్ ధర ఆధారంగా ఈ ప్రారంభ ధరను నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. రూ.11 వేలతో కొత్త బాలెనోను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
కొత్త బాలెనోలో భద్రతకు పెద్దపీట వేశారు. ఇందులో **లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)**ను అందించారు. దీనికి తోడు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. నగర ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాల్లోనూ డ్రైవింగ్ అనుభూతిని మరింత సౌకర్యవంతంగా మార్చేలా పలు మార్పులు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. కొత్త బాలెనోలో జెడ్12ఇ పవర్‌ట్రెయిన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 61 కిలోవాట్ల పవర్, 112.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యువత అభిరుచులకు అనుగుణంగా మొత్తం ఏడు రంగుల ఎంపికలో ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చారు.
కారు లోపలి భాగంలో 22.86 సెంటీమీటర్ల స్మార్ట్‌ప్లే ప్రొ+ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హై-డెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు సులభమైన ఇంటర్‌ఫేస్‌ను అందించారు. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా పొందొచ్చు.
సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ వ్యవస్థ కూడా కొత్త బాలెనోలో ఉంది. వాహన భద్రత, ప్రయాణ వివరాలు, డ్రైవింగ్ విధానం, వాహన స్థితికి సంబంధించిన అలర్ట్స్‌తో పాటు సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా రిమోట్ ఆపరేషన్లు వంటి 40కి పైగా ఫీచర్లు ఇందులో లభిస్తాయని కంపెనీ తెలిపింది.
మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. ఎస్‌యూవీలపై వినియోగదారుల ఆసక్తి కొనసాగుతున్నప్పటికీ భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం వృద్ధి చెందుతోందన్నారు. తమ వ్యక్తిత్వాన్ని ధైర్యంగా చాటుకోవాలనుకునే యువతను దృష్టిలో పెట్టుకుని కొత్త బాలెనోను రూపొందించినట్లు చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















