తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో పార్టీని మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ సభలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు.
తెలంగాణ జాగృతి ఉద్యమం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకున్నామని, బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేశామని కవిత పేర్కొన్నారు. అయితే తెలంగాణ కోసం కలలు కన్న ఆశలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత, పార్టీ ఆత్మను కోల్పోయిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ రథం దారి తప్పిందని, రాష్ట్ర ప్రజల సమస్యలను అర్థం చేసుకోలేకపోయిందని విమర్శించారు. గతంలో తాను కూడా ఆ వ్యవస్థలో భాగమని, జరిగిన తప్పుల్లో తనకూ బాధ్యత ఉందని పేర్కొంటూ ప్రజలకు క్షమాపణలు తెలిపారు.
సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగించాలంటే రాజకీయ అధికారం అవసరమని, అందుకే కొత్త పార్టీని స్థాపించామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో సమానత్వం సాధించేందుకు రాజకీయ శక్తితో పాటు ఉద్యమాన్ని కలిపి ముందుకు సాగుతామని తెలిపారు. కేసీఆర్ గురించి మాట్లాడుతూ, గతంలోని నాయకత్వం, ప్రస్తుత పరిస్థితి మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. అలాగే కేంద్రంలో ఉన్న భాజపాపై కూడా విమర్శలు చేస్తూ, రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు.
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి తల్లిగా సేవ చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని కవిత తెలిపారు. మూడు ప్రధాన పార్టీలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















