హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అందజేసే అన్ని సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు వంటి అన్ని వస్తువులు నాణ్యమైనవే ఉండాలని స్పష్టం చేశారు.
జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాలని, సరఫరా పూర్తయ్యిన వెంటనే సరఫరాదారులకు చెల్లింపులు జరుపుతామని తెలిపారు. సరఫరా చేసిన వస్తువుల నాణ్యతపై విద్యార్థుల నుంచే ఫీడ్‌బ్యాక్ సేకరించాలని సూచించారు.
గతంలో వేర్వేరు శాఖలు విడివిడిగా కొనుగోళ్లు చేయడం వల్ల ఏకరూపత లేకపోవడంతో పాటు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఎలాంటి అవకతవకలు సహించబోమని హెచ్చరించారు.
ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించి, పాఠశాలలు మరియు హాస్టళ్లకు సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సరఫరా ప్రక్రియకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి అవసరమైన సామగ్రి అందిందో లేదో ఖచ్చితంగా తనిఖీ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు విద్యాశాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















